బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తరువాత బాలీవుడ్ సెలబ్రిటీలపై, ముఖ్యంగా స్టార్ కిడ్స్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రముఖ హీరో అనిల్ కపూర్ కూతురు, హీరోయిన్ సోనమ్ కపూర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఓ మహిళ తాజాగా మెసేజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సోనమ్ కపూర్ సోషల్ మీడియా వేదికగా ఓ అమెరికన్ ఇన్ఫుఎన్సర్ చేసిన వాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. సదరు మహిళా సోషల్ మీడియాలో సోనమ్, ఆమె భర్త గురించి ప్రస్తావిస్తూ “నువ్వు ఈ మెసేజ్ చదవవని నాకు తెలుసు. నువ్వు తప్పుడు ఆరోపణల గురించి, మహిళా సాధికారిత గురించి మాత్రమే మాట్లాడుతావు. నీలాంటి మహిళ సమాజంలో నెగిటివిటీని వ్యాప్తి చేస్తుంది. మీ నాన్న లేకపోతే నువ్వు శూన్యం. నీలాంటి నటీమణులకు భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషంగా ఉంది. నీకు కనీసం నటించడం కూడా రాదు. పూర్తిగా బంధుప్రీతి నుంచి వచ్చిన నటివి నీవు. మరో విషయం… నీ భర్త చాలా బాగుంటాడని నువ్వు అనుకుంటున్నావా? మరోసారి ఆయన్ను చూడు ఎంత అందవిహీనంగా ఉన్నారో తెలుస్తుంది” అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఈ వాఖ్యాల పైన సోనమ్ స్పందిస్తూ “ఇలాంటి సందేశాన్ని పంపించి నువ్వు ఫాలోవర్స్‌ను సంపాదించాలి అనుకున్నావు. అంతేకాకుండా నా దృష్టిలో పడటానికి ఇది పంపించావు అని నాకు తెలుసు. ఆమె చేసిన ఈ వాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి. ఇంతటి ద్వేషం వారినే నాశనం చేస్తుంది” అని సోనమ్ కపూర్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో సదరు మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని, అలాంటి ద్వేషపూరితమైన సందేశాలను పంపను అని తెలిపింది.
previous post
next post
“పాకిస్తాన్ జిందాబాద్” అంటున్న హీరోయిన్