telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్‌బాస్‌4: ఈ వారం ఎలిమినేట్‌ ఎవరో తెలుసా..!

Bigg-Boss-4

స్టార్ మా లో వస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4 షో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు అది ముగింపు దశకు చేరుకుంది. చివరి నాలుగు వారాల నుంచి బిగ్ బాస్ బాగా పుంజుకుంది. రేటింగ్స్ కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్టార్ మా సంచలన నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ టైమింగ్స్ మారుస్తూ తాజాగా యాడ్స్ విడుదల చేసారు. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది.. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది. ఇక శుక్రవారం అర్ధరాత్రితో హాట్ స్టార్‌, మిస్డ్‌ కాల్‌ ఓటింగ్‌ కూడా ముగిసింది. ఈ వారం బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఒక టాస్క్‌లో సోహెల్‌, అరియానా గొడవ పడిన సంగతి తెలిసిందే.. సోహెల్‌ చాలా ఆగ్రహంతో అరియానాపైకి వెళ్లాడు. అరియానా కూడా అస్సలు తగ్గలేదు. తను కూడా సోహెల్‌ పైకి దూసుకెళ్లింది. అతినితో తీవ్ర వాగ్వాదం తరువాత కిందపడి బోరున ఏడ్చింది. ఇది ఇలా ఉండగా.. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ వారం మోనాల్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌న వీడక తప్పదని అంటున్నారు. హౌజ్‌లో ఉన్న వారలో మోనాల్‌ లిస్ట్‌లో ఉన్నట్లు… ఈ వారం ఎలిమినేట్‌ కానున్నట్లు సమాచారం.

Related posts