బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి V6లో తీన్మార్ వార్తలతో జర్నీ మొదలుపెట్టి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత TV9లో చేరి ఇస్మార్ట్ న్యూస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఈ జర్నీ ఎక్కువకాలం నిలువలేదు. కారణం ఏదైనప్పటికీ ఆయన సాక్షి టీవీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిత్తిరి సత్తి జూలై 10న సాక్షిలో చేరినట్లు తెలిసింది. ఆ రోజు ఆ ఛానెల్ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి బిత్తిరి సత్తి ఎంట్రీని స్వాగతించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ. ఈ నేపథ్యంలోనే తాజాగా బిత్తిరి సత్తికి ఎంట్రీ తాలూకు తొలి వీడియోను రిలీజ్ చేసింది సాక్షి యాజమాన్యం. ఈ వీడియోలో తండ్రి, కొడుకు వేషాల్లో కనిపించిన బిత్తిరి సత్తి.. తన గోడు వెలిబుచ్చుతూనే మళ్ళీ మీ అందరినీ నవ్విస్తూ వార్తలు చెబుతా అని కాన్ఫిడెంట్‌గా చెప్పడం విశేషం. ”ఇది తండ్రిని గౌరవించుకునే జాగ.. ఇగ నీకు తిరుగులేదు.. ఇగ ఏడికి తిరిగేది లేదు” అంటూ తండ్రి డైలాగ్, ”రావాల్సిన చోటుకే వచ్చా… ఇకపై సత్తా చూపిస్తా” అని కొడుకు డైలాగ్‌లను చెప్పి ఆకట్టుకున్నాడు బిత్తిరి సత్తి. అంతేకాదు ”ప్రేక్షకులు తమ గుండెల్లో స్థానమిచ్చారు.. గుండీలిప్పుకొని తిరుగుత” అని సత్తి చెప్పడం చూస్తుంటే ఇక సాక్షిలో కూడా ఆయన ఏ రేంజ్‌లో రెచ్చిపోనున్నారో అర్థమవుతోంది.