telugu navyamedia
సినిమా వార్తలు

రెహమాన్ సంగీతం సారధ్యంలో సింగర్ గా స్టార్ హీరో

Bigil

అట్లీ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్, అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. “బిగిల్‌” (విజిల్) అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే, మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం వ‌హిస్తున్నాడు. ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ తొలిసారి పాట పాడారు. గ‌తంలో విజ‌య్ ‘రసిగన్, వేలై, తుపాకీ, కత్తి, తేరి, భైరవ’ వంటి సినిమాల్లో ప‌లు పాట‌లు పాడారు. తొలి రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో త‌న తాజా చిత్రం బిజిల్ కోసం ఓ పాట ఆల‌పించారు. ‘వెరితనం..’ అంటూ ఈ పాట సాగుతుంది. వెరితనం అంటే కసి, ఉన్మాదం వంటి అర్థాలున్నాయి. ఈ పాట సంగీత ప్రియుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం నమ్మకంతో ఉన్నారు.

Related posts