telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జపాన్ లో రానా పుట్టినరోజు వేడుకలు

Rana

“బాహుబలి” చిత్రానికి, అందులో నటించిన నటులందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా జపాన్‌లో “బాహుబలి”కి వీరాభిమానులున్నారు. ఆ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, సుబ్బరాజు తదితరులకు అక్కడ అభిమానులేర్పడ్డారు. తాజాగా రానా జన్మదినోత్సవాన్ని జపాన్ అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇళ్లలో రానా కటౌట్‌లను, ఫొటోలను పెట్టుకుని బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను రానా లైక్ చేశాడు. రానా ఇటీవల జపాన్ వెళ్లి అక్కడి అభిమానులను కలిసిన సంగతి తెలిసిందే. ఇక బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి తెలుగులో “విరాట ప‌ర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మరోవైపు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు.

Related posts