telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏపీలో షూటింగులకు ప్రభుత్వం అనుమతి : చిరంజీవి

Tollywood

సీఎం జగన్‌తో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన తరువాత చిరంజీవి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్‌ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకి గతంలో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఎత్తివేయాలని కోరామని దానిపై సానుకూలంగా స్పందించారన్నారు. 2019-20 నంది అవార్డులు ఇచ్చేందుకు అంగీకరించినట్టు చిరంజీవి చెప్పారు. ఇక ఈ నెల 15 తర్వాత ఏపీలో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక ఇదే విషయమై చిరంజీవి స్పందిస్తూ ట్విట్టర్ లో “సినిమా పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన ఏపీ సి ఎం శ్రీ వై ఎస్ జగన్ గారికి కృతఙ్ఞతలు. షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వారికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. 

Related posts