telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాక్ సింగర్ ప్రైవేట్ ఫొటోస్ లీక్… మోడీని బెదిరించింది ఈమే…!

Rabi

పాకిస్థానీ గాయని రబీ పీర్జాదాకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దాంతో షాకైన రబీ ‘రబీ పీర్జాదా అనే నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నాను. నేను చేసిన పాపాలకు అల్లా క్షమిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలకు మంచి మనసు ప్రసాదించాలని అల్లాను కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. గతవారం రబీకి చెందిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఎవరు లీక్ చేశారో తెలీదు కానీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దాంతో చాలా మంది రబీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఏలో రబీ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇటీవల రబీ సూసైడ్ బాంబర్ జాకెట్‌ను వేసుకుని మోదీని బెదిరిస్తూ ఓ ట్వీట్ పెట్టింది. ‘మోదీ హిట్లర్’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు కశ్మీర్ వివాదంపై స్పందిస్తూ పాములు, మొసళ్లను పట్టుకుని వీడియో తీసి మోదీపై బెదిరింపులు పాల్పడింది. ‘ఈ కానుకలన్నీ మోదీకే. నా ఫ్రెండ్స్ మిమ్మల్ని తినేస్తాయి’ అని ఇష్టమొచ్చిన ట్వీట్లు చేసేది. ఈ వీడియో చూసి వైల్డ్ లైఫ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాములను, మొసళ్లను ఇంట్లో పెంచుతున్నందుకు ఆమెకు జరిమానా విధించారు. ఆ తర్వాత ఈ ఘటనపై రబీ స్పందిస్తూ.. ఈ పాములను తాను పెంచుకోవడం లేదని వీడియో తీయడానికి రెంట్‌కు తెచ్చుకున్నానని తెలిపింది. గత ఐదేళ్లుగా వివిధ ఛానెల్స్‌లో ఇలా పాములు పట్టుకుని ఎన్నో వీడియోలు చేశానని తెలిపింది. ఆ సమయంలో ఎవ్వరూ తనను పట్టించుకోలేదని తెలిపింది. ఇప్పుడు మోదీని బెదిరిస్తున్నందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది. అయితే మోదీపై రబీ బెదిరింపులకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాతే ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటికి రావడం గమనార్హం. మోదీని అన్నందుకు ఇండియాకు చెందిన వారే ఈ పని చేసుంటారని పాక్ పోలీసులు భావిస్తున్నారు.

Related posts