స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో మేక’ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను ఒకే సమయంలో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషల్లో వివిధ గాయకులు పాడారు.
అయితే గడిచిన 11 రోజుల్లో యూ ట్యూబ్ లో తెలుగు సాంగ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. అలానే కన్నడ వర్షన్ 9వ స్థానంలోనూ, తమిళ వర్షన్ 11వ స్థానంలోనూ, మలయాళ వర్షన్ 17వ స్థానంలోనూ ఉండటం విశేషం. ఓ తెలుగు సినిమా ఈ రకంగా 11 రోజుల పాటు నాలుగు భాషల్లో ఇలా ఇరవై స్థానాల లోపు చోటు దక్కించుకోవడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్, సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ‘పుష్ప’ను మరో లెవెల్ కు తీసుకెళ్ళడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.