telugu navyamedia
సినిమా వార్తలు

చిరుతో ఉన్న సీక్రెట్ రివీల్ చేసిన రోజా

 మెగాస్టార్  చిరంజీవితో సరితూగే గ్లామర్, గ్రేస్ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రోజా ఒకరు. రోజా-చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే అందులో వీరిద్దరిపై చిత్రీకరించిన పాటలు, వేసిన స్టెప్పులు మరో ఎత్తు.

అప్ప‌ట్లో చిరం జీవి, రోజా కాంబినేషన్ లో వ‌చ్చిన‌ ”ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్” సినిమా పెద్ద హిట్ అయ్యాయి. వెండితెరపై ఈ ఇద్దరు పండించిన కెమిస్ట్రీ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో రోజా త‌న‌ గ్లామ‌ర్‌తో త‌న కంటూ ప్ర‌త్యేక‌మైన‌ స్థానం సంపాదించుకుంది. అప్ప‌ట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గ్ల‌ళ్ రోజా.. అందుకే అప్పుడు గ్లామ‌ర్‌ గ్ల‌ల్ అని బిరుదు ఉండేది.

మెగాస్టార్ అభిమాని అయినా పొలిటికల్ గా మాత్రం చిరంజీవితో శత్రుత్వాన్ని కొన‌సాగించింది ఎమ్మెల్యే రోజా. పీఆర్పీ పార్టీ పెట్టిన చిరంజీవిని అప్పట్లో టీడీపీలో ఉండే రోజా అభిమాన కథానాయకుడు అన్న మొహమాటం లేకుండా చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేసేది.

When Roja Cheated Chiranjeevi

అంతేకాకుండా చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని రోజా బయటికి తీసింది. రాజకీయాల నుండి సినిమాల్లో మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత.. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చిరంజీవిని పోగొడుతూ వస్తుంది.

తాజాగా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా తన భర్త ఆర్కే సెల్వమణితో కలిసి ఓ వీడియో చాట్‌లో పాల్గొన్న రోజా.. మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో పంచుకున్న సినీ జర్నీని నెమరు వేసుకున్నారు రోజా.‘మెగాస్టార్ ఫ్యామిలీతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు షూటింగ్ లో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. సురేఖ అక్క అయితే అందరినీ చాలా బాగా చూసుకునేది.

chiranjeevi: Roja: రోజాతో మెగాస్టార్‌ డీల్.. పక్కా ప్లాన్ చేసిన చిరంజీవి! ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కి పండగే.. - chiranjeevi and roja tie up after long time for lucifer remake ...

ప్రభుదేవా, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా ఎవరు వస్తే వారికి ఇష్టమైన ఫుడ్ వండి పెడుతూ చాల బాగా చూసుకునేది సురేఖ అక్క’ అని చెప్తూనే మెగాస్టార్ తో తన లైఫ్ లో మర్చిపోలేని ఒక భయంకర సంఘటనని రివీల్ చేసింది రోజా. ‘అది ఒక దెయ్యం సాంగ్ షూట్. సాయంత్రం ఆరు తరువాత చిరంజీవి నన్ను భయపెట్టడానికి ఎదో ప్లాన్ చేస్తున్నారని బ్రహ్మానందం చెప్పే సీన్ షూట్ అది..

‘బూత్ బంగ్లాలో షూటింగ్ చేస్తుండగా ఈ అమ్మాయికి చాలా పొగరు కదా అని, ఆ పొగరు దించాలని ప్లాన్ చేశారట చిరంజీవి గారు. ప్రొడ్యూసర్‌తో పాటు అంతా దయ్యాల్లా మాస్కులు వేసుకొని నన్ను భయపెట్టేందుకు నా వెనుక కూర్చొని ఉన్నారు. నేను వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా వాళ్ళని చూసి నా పని అయిపోయింద‌నుకొని, భయంతో కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి, వరుసపెట్టి వాంతులు కూడా చేసుకున్నా.

ఆ సీన్ చూసిన చిరంజీవి గారు నన్ను చూసి భయంతో ఇంటికి పారిపోయాడు. కొద్దిసేపటికి నాకు ఫోన్ చేసి ఎలా ఉందంటూ మాట్లాడాడు. నా పరిస్థితి బెటర్ అని తెలిసీ ఆయన రిలాక్స్ అయ్యాడు’ అంటూ అలనాటి డేంజరస్ సీక్రెట్ ని రివీల్ చేసింది.

Related posts