telugu navyamedia
సినిమా వార్తలు

మజిలీ రీమేక్… నాగ్ కు ఇష్టం లేదా…!?

majili movie first look

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తమిళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ధనుష్ హీరో గా మజిలీని అక్కడ రీమేక్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ సినిమా హక్కుల కోసం నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నాగార్జున ఆలోచన మాత్రం మరో విధంగా ఉందట. మజిలీని రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి అక్కడ విడుదల చేస్తే తన కొడుకు నాగచైతన్యకు తమిళ మార్కెట్లో క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట నాగార్జున. మరో వైపు నిర్మాతలు మజిలీ రీమేక్ రైట్స్ ను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఏదేమైనా మజిలీ మాత్రం అక్కినేని కుటుంబానికి ఒక తియ్యని జ్ఞాపకం.

Related posts