telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్వశ్చన్ మార్క్ ? : “రామసక్కనోడివిరా ను పిలగా” వీడియో సాంగ్

?

యంగ్ హీరోయిన్ ఆదా శర్మ లేటెస్ట్ మూవీ ‘?’. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై విప్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని ‘రామ‌స‌క్క‌నోడివిరో’ అనే పాట‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

యమ హుషారెత్తిస్తున్న ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆదా శర్మ తన స్టెప్పులతో హాట్ కిక్కిచ్చింది. హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ..”ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈసినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న చిత్రాలే. అదే కోవ‌లో ఈ సినిమాలో కూడా న‌ట‌ను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. క‌రోనా టైమ్‌లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైర‌క్ట‌ర్స్ ఎక్స్ లెంట్‌గా డీల్ చేశారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది” అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ..”ఈ చిత్రంలో మొద‌ట పాట పెట్టాల‌నుకోలేదు. షూటింగ్ పూర్త‌య్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి స‌త్యం గారు అద్బుత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్ ఆదాశ‌ర్మ‌గారు అద‌ర‌గొట్టారు. నిర్మాత గౌరికృష్ణ గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ద‌ర్శ‌కుల ప‌నితీరు ఏంటో ఈ పాట‌ తోనే తెలుసుకోవ‌చ్చు. ఇక ఈ పాండ‌మిక్ టైమ్‌లో ఈ సినిమా రావ‌డం కొంత సంతోషాన్ని క‌లిగించే విష‌యం” అన్నారు.

Related posts