telugu navyamedia
సినిమా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన త‌లైవా..

సూప‌ర్‌స్టార్‌ రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప అనారోగ్యంతో ఇటీవలే ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ చేయగా అది విజయవంతంగా పూర్తైంది. గత నాలుగు రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందించారు వైద్యులు. రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి రజినీకాంత్ ఆరోగ్యంపై బులిటెన్ కూడా విధుల చేసి రజినీకాంత్ త్వరగా కోలుకుంటారు అని తెలిపారు.

rajinikanth: Rajinikanth discharged from hospital, back home! | Tamil Movie  News - Times of India

అయితే వైద్యుల సూచనల మేరకు రజినీకాంత్ కోలుకున్నారని నిన్న రాత్రి కుటుంబ సభ్యులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇప్పుడే ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదు అని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు వైద్యులు. రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారని తెలిసి అభిమానులు ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు. ఫ్యాన్స్ కి నమస్కారం చేసి లోపలి వెళ్లిపోయారు సూపర్ స్టార్. ప్రస్తుతం రజినీకాంత్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు.

Rajinikanth returns home from hospital after three days 

కాగా.. రజనీ ఆస్పత్రి నుంచి బయటకు రావడానికి ముందే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సూపర్‌స్టార్‌ను పరామర్శించారు. స్టాలిన్‌ రజనీ బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Related posts