telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుమ్మడికాయ దొంగ అంటే భుజాలెందుకు తడుముకుంటున్నారు ? : నాగబాబు

Nagababu

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చేసిన కామెంట్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. నాగబాబు, బాలయ్యను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఆ తరువాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు అలా 5 వీడియోలను విడుదల చేసి బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు నాగబాబు. చివరగా మరో వీడియోను విడుదల చేసి ఈ వివాదాన్ని ఆపేస్తానని స్పష్టం చేశారు. తాజాగా నాగబాబు “గుమ్మడికాయ దొంగ అంటే భుజాలెందుకు తడుముకుంటున్నారు ?” నేను చేసిన పోస్ట్ లకు మీనింగ్ ఇదే…” అంటూ మరో వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో తాను ఎప్పుడూ బాలకృష్ణని వ్యక్తిగతంగా విమర్శించలేదని, తన ఫేస్ బుక్ పోస్ట్ లలో బాలకృష్ణ పేరు అసలు ప్రస్తావించలేదని అన్నారు. మెగా బ్రదర్స్ పై బాలకృష్ణ వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారని… అలాంటప్పుడు ఓ అన్నగా, తమ్ముడిగా నేను రియాక్ట్ అయితే తప్పేంటని ప్రశ్నించారు. బాలకృష్ణ ఎవరో తెలియదు.. పెద్ద బాలకృష్ణ తెలుసని చెప్పినందనుకు ఇంత వివాదం చేస్తారా..? అని మండిపడ్డారు. అయినా గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించాడు.

మెగాబ్రదర్స్ పై బాలకృష్ణ ఐదు సార్లు నోరు జారి వ్యక్తిగతంగా విమర్శించినా తాము ఏమీ అనలేదని, కామెంట్ చేయాలంటే మా దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉందని, కానీ ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి కామెంట్ చేయాలో అనే కామన్ సెన్స్ ఉందని, 2011 లో చిరంజీవిపై బాలయ్య చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని నాగబాబు స్పష్టం చేశారు.

Related posts