telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

స్నేక్ బాబు ఎక్కడ… ? అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర… నాగబాబుపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

Srireddy

వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. దీంతో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మరోపక్క జగన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ, జనసేన పార్టీలు ఘోర ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది నటి శ్రీరెడ్డి. సందర్భం వచ్చిన ప్రతిసారీ శ్రీరెడ్డి జనసేనను ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా పవన్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే రావడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ పవన్ అభిమానులు ఆగ్రహానికి కారణమవుతోంది. తాజాగా నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా జనసేన పార్టీ నుండి పోటీ చేసిన నాగబాబు ఓడిపోవడంతో తనదైన శైలిలో నాగబాబుని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. “మూలశంఖోడు ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ..?? జబర్దస్త్ రీఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర వెయిటింగ్ అంటగా” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన జనసైనికులు శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు.

Related posts