telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెప్టెంబర్ 28 నుంచి ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’

KCB

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ). ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌ తిరిగి షూటింగుల్లో పాల్గొంటున్నారు. ‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ 12వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు అమితాబ్. షూటింగ్ మొదలైన దగ్గరనుంచి కేబీసీ కి సంబందించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు అమితాబ్ బచ్చన్. ఇప్పటికే 11 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 12వ సీజన్ కు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొవిడ్‌-19 భద్రతా చర్యల కారణంగా 12వ సీజన్‌ గత సీజన్ల కంటే భిన్నంగా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పుడు ‘జోడీదార్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆలాగే ఫోన్ ఏ ఫ్రెండ్ అనే దానికి బదులు వీడియో కాల్ ఏ ఫ్రెండ్‌ను తీసుకువచ్చారు. వీడియో కాల్‌లో ప్రశ్న అడగాల్సి ఉంటుందట. అమితాబ్ సోషల్ మీడియ వేదికగా ఫేస్ షీల్డ్ పెట్టుకున్న ఒక ఫోటోను షేర్ చేశారు. దానికి “బీ సెఫ్ బీ ప్రొటక్షన్” అని జత చేసారు.

Related posts