రెండేళ్ళ విరామం తర్వాత “పింక్” మూవీ రీమేక్ “వకీల్ సాబ్”తో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇప్పటికే మొదలు పెట్టేశాడు పవన్.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే సైలెంట్‌గా రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ వచ్చిన తరువాతే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పేశాడు. అటు క్రిష్ కూడా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో తాజాగా ఓ కొత్త సినిమాని మొదలుపెట్టాడు. దీనితో క్రిష్, పవన్ మూవీ ఆగిపోయిందన్న రూమర్స్ మొదలయిపోయాయి.. అయితే దీనిపైన దర్శకుడు క్రిష్ స్పందించారు. పవన్‌తో చేస్తున్న సినిమా ఆగిపోలేదని, కరోనా వైరస్ కారణంగానే సినిమా వాయిదా పడిందని, వచ్చే ఏడాది తిరిగి మిగిలిన పార్ట్ ని కంప్లీట్ చేస్తామని క్రిష్ స్పష్టం చేశారు. కాగా “వకీల్ సాబ్”లో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ తో పాటుగా అనన్య పాండే, అంజలి, నివేధా థామస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్, దిల్ రాజులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
previous post