telugu navyamedia
సినిమా వార్తలు

కోర్టు ముందు సామాన్యులు .. సెలబ్రిటీలు ఒక్క‌టే..

సోషల్‌మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత మూడు యూట్యూబ్ ఛాన‌ల్స్‌పై ప‌రువున‌ష్టం దావా వేసిన పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి.

సమంత తరఫు న్యాయవాది ప్రతివాదలకు నోటీసులు పంపించని కారణంతో ఈ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది.హై రెప్యుటేడ్ పర్సనాలిటీకి సంబంధించిన అంశం కావడంతో త్వరగా వినాలని సమంత లాయర్ బాలాజీ కోర్ట్ ను కోరారు. సామాన్యులు అయిన సెలబ్రిటీలు అయిన న్యాయస్థానం ముందు ఒక్కటే అని కూకట్‌పల్లి కోర్టు పేర్కొంది.

Samantha is the next guest on Evaru Meelo Koteeswarulu, her first  appearance after separation - Movies News

స‌మంత ఇంకా విడాకులు తీసుకోలేద‌ని, ఈ లోగానే ఆమెపై దుష్ప్ర‌చారం చేస్తూ ప‌రువుకు భంగం క‌లింగేలా ప్ర‌వ‌ర్తించారని, స‌మంత‌ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్త‌లు రాశార‌ని, ఆమెకు అక్ర‌మ సంబంధాలు అంట‌గ‌ట్టార‌ని సమంత త‌ర‌పు న్యాయ‌వాది బాలాజీ కోర్టులో వాదించారు.

త‌ప్పు జ‌రిగింద‌ని భావిస్తే ప‌రువున‌ష్టం దాఖ‌లు చేసే బ‌దులు వారినుండి క్ష‌మాప‌ణ‌లు కోర‌వ‌చ్చుక‌దా అని ప్ర‌శ్నించింది కోర్టు. సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ప‌బ్లిక్ డొమైన్ లో వారే పెడుతున్నార‌ని, ప‌రువుకు భంగం క‌లిగింది అని వారే అంటున్నార‌ని కోర్టు పేర్కొన్న‌ది. కాగా, ఈకేసులో వాద‌న‌లు ముగియ‌డంతో తీర్పును కూక‌ట్‌ప‌ల్లి కోర్టు రేప‌టికి వాయిదా వేసింది.

Samantha Akkineni's Saaki World launches Sankranti collection for festive  shopping

Related posts