అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని అఖిల్ లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వేసే ఏడడుగుల్లో ఒక అడుగు ఇదోగనంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిబ్రవరి 8న వదిలారు. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్గా పూజా హెగ్డే లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే విభ పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో పూజా హెగ్డే చాలా అందంగా కనిపించింది. తాజాగా ఈ సినిమాకు చెందిన ప్రీ టీజర్ ను ఇవాళ ఉదయం విడుదల చేసారు ఈ చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
previous post
విద్యాబాలన్ ముద్దులతో మెసేజ్ చేసింది… హీరో షాకింగ్ కామెంట్స్