రనూ మండల్ గతంలో పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడుకుంటూ జీవనం సాగించేది. లతామంగేష్కర్ పాడిన “ఏక్ ప్యార్ కా నగ్‌మా హై” పాటను రనూ మండల్ పాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తన గానమాధుర్యంతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన రనూ మండల్ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నారు. బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రేష్మియాతోపాటు ‘తేరీ మేరీ కహానీ’ పాట పాడిన రానూ మండల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిల్మ్ మేకర్ రుషీకేష్ మండల్… రనూ మండల్ బయోపిక్ రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రనూ మండల్ పాత్రను నేషనల్ అవార్డు విన్నర్, బెంగాలీ నటి సుదీప్తా చక్రవర్తి పోషించనున్నారు. ఒక ఇంటర్యూలో రుషికేష్ మండల్ మాట్లాడుతూ సుదీప్తా చక్రవర్తిని ఇందుకోసం ఇటీవల సంప్రదించామని, అయితే ఆమె ఇంకా ఏ విషయాన్ని స్పష్టం చేయలేదని అన్నారు. ఈ పాత్రకు సుదీప్తా అయితేనే సూట్ అవుతుందని, ఆమె అద్భుతమైన నటి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుదీప్తా మాట్లాడుతూ తనకు ఈ సినిమా ఆఫర్ వచ్చిందని, అయితే స్క్రిప్ట్ చదవలేదని అన్నారు.
previous post
ఆ దర్శకుడి చెంప పగలగొట్టా… నటి కామెంట్స్