telugu navyamedia
సినిమా వార్తలు

బంగారం లాంటి నా బ్రదర్ అంటున్న మనోజ్… ఎవరినో తెలుసా ?

Manchu-Manoj-with-Ram-Charan

నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. సామజిక అంశాల పట్ల, తన తోటి హీరోలపట్ల సానుకూలంగా స్పందిస్తూ ఇతర హీరోల అభిమానాన్ని కూడా పొందుతున్నాడు. తన యాటిట్యూడ్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను క్రమంగా పెంచుకుంటున్నాడు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “బంగారం లాంటి నా బ్రదర్ రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకెప్పుడూ ఆనందంతో కూడిన బ్లాక్ బస్టర్ జీవితం చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ రామ్ చరణ్ ను హత్తుకున్న ఫోటోను, ఆయన చేతిలో చెయ్యేసిన ఫోటోను షేర్ చేశాడు మనోజ్. ఈ ఫొటోకు అభిమానుల నుంచి “మెగా” స్పందన లభిస్తోంది. ఇక మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుతో కలిసి ఇటీవల శ్రీవిద్యానికేతన్ సంస్థల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయమై నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

Related posts