telugu navyamedia
సినిమా వార్తలు

‘లా లా భీమ్లా’ సాంగ్‌కు స్టెప్స్ వేసి అదరగొట్టిని థ‌మ‌న్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్ మరోసారి స్టెప్పులతో అదరగొట్టాడు…లా లా భీమ్లా.. సాంగ్‌కు థమన్ మాస్ స్టెప్స్ వేసి అదరగొట్టాడు. భీమ్లా నాయక్ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న థమన్ ఈ మూవీలో ‘లా లా భీమ్లా’ సాంగ్‌కు స్టెప్స్ వేసి అదరగొట్టాడు.

తను మ్యూజిక్ ఇచ్చిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతోంది.దాదాపు టాలీవుడ్‌లో ఉన్న అందరు హీరోల సినిమాలకు థమన్ ఇప్పుడు సంగీతం అందిస్తున్నాడు. గత ఏడాది ‘అఖండ’ సినిమాకు థమన్ అందించిన సాంగ్స్, బీజీఎంకు మంచి పేరొచ్చింది. ఆ సినిమా థమన్ రేంజ్‌ను మరింతగా పెంచేసింది

ఇక, తాజాగా పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి – నిత్యా మీనన్ – సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘భీమ్లా నాయక్’ ఒకటి. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అన్ని ముందే మంచి హిట్ కొట్టాయి. మూవీకి థమన్ ది బెస్ట్ మ్యూజిక్ అందించాడని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

ఇటీవల తమన్ తను కంపోజ్​ చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి’ సాంగ్ కు మహేష్ వేసిన స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మహేష్ అభిమానులని ఆనందపరిచాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్​ మాస్టర్​తో కలిసి మహేష్ చేసిన స్టెప్పులని దించేసాడు.

ఇన్నాళ్లు సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కనపడిన తమన్ ఇలా స్టెప్పులు వేసేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ అభినందించారు. తమన్ వేసిన ఆ స్టెప్పులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related posts