telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఈ నెల 31న ఆచార్య నుండి ఫస్ట్ సింగిల్…

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’. అయితే ఆచార్య గత షెడ్యూల్ గోదావరి ఖనిలోని మైనింగ్ ప్రాంతంలో జరిగింది. అది పూర్తి కాగానే చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. అయితే… తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మళ్ళీ మొదలైంది. ఇక చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. పుట్టినరోజున చరణ్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ, ‘లాహి లాహి… అనే ఫస్ట్ సింగిల్ ను మార్చి 31వ తేదీ సాయంత్రం 4.05 నిముషాలకు రిలీజ్ చేస్తున్నాం. మీకు ప్రామిస్ చేసినట్లుగానే వింటేజ్ మెగాస్టార్ ని మీ ముందు ఉంచుతున్నాం’ అని అన్నారు. ఉదయం ‘ఆచార్య’తో పాటు ‘కామ్రేడ్ సిద్ధా’ను పరిచయం చేసిన యూనిట్ సాయంత్రం కొత్త అప్ డేట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేసింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా మే 13 న విడుదల కానుంది.

Related posts