telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆదిపురుష్”లో ప్రభాస్ పాత్రను లీక్ చేసిన దర్శకుడు

Adipurush

రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా వస్తోంది. 3డి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ చూసి ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని అంతా అంచనా వేశారు. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారేమో అని కూడా అనుకున్నారు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ మైథలాజికల్ డ్రామాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నట్టు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ప్రభాస్ గారిని శ్రీరాముడిగా చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. వెండితెరపై గతంలో చాలా కొద్ది మంది నటులు మాత్రమే రాముడి పాత్ర పోషించారు. ‘ఆదిపురుష్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌లో నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. భూషణ్ కుమార్, ఓం రౌత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Related posts