telugu navyamedia
సినిమా వార్తలు

ఆచార్య నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌…

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోండ‌గా.. చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది.

అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి.. ఈ 'నీలాంబరి'

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి సెకండ్‌ సింగిల్‌ పేరుతో పూజ హెగ్డేపై సాగే ‘నీలాంబర్‌’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు . దీపావళి సందర్భంగా గురువారం ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తూ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ నేడు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి’ అంటూ ఈ పాట సాగుతన్న ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి – రమ్య బెహ్రా ఆలపించారు. ఈ మెలోడీ సాంగ్​లో చరణ్, పూజ కెమిస్ట్రీ అదిరిపోయింది.

Acharya Song : నీలాంబరిని వర్ణిస్తూ పాటలుపడుతున్న సిద్ద.. ''ఆచార్య'' నుంచి అందమైన మెలోడీ..

కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts