telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలోంచి భారత మహిళను దించేశారు… ఏం జరిగిందంటే ?

PLane

టూరిస్ట్ వీసాపై దుబాయి వెళ్లి 40 ఏళ్ల మహిళ తిరిగి భారత్ వచ్చేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కింది. అనంతరం విమానంలో తనకు ఊపిరి ఆడడం లేదని, ఉక్కపోతగా ఉందంటూ ఏసీ పనిచేయడం లేదని విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. దాంతో ఫ్లైట్ టేకాఫ్‌కు రెడీ ఉందని.. టేకాఫ్ అయిన తరువాత అన్నీ సర్దుకుంటాయని సిబ్బంది ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు సరికదా ఇంకా ఎక్కువ హంగామ చేసింది. తాను ఈ విమానంలో ప్రయాణం చేయనని న్యూసెన్స్ చేసింది. దాంతో విమానాన్ని తిరిగి టర్మినల్‌పైకి పంపించి.. ఓ మహిళ అధికారితో సదరు మహిళను కౌన్సిలింగ్ చేయించారు. ఆమె మాట కూడా వినకపోవడంతో చివరకు దుబాయి పోలీసులకు సమాచారం ఇచ్చారు విమానాశ్రయ అధికారులు. పోలీసులకు కూడా ఆమె సరిగ్గా సహకరించలేదని అక్కడి మహిళ అధికారులు పేర్కొన్నారు. అరబిక్‌లో ఉన్న ఓ లేఖపై సంతకం చేసేందుకు సైతం ఆమె నిరాకరించింది. దుబాయి పోలీసులు కొద్దిసేపు ఆమెను ప్రశ్నించిన తరువాత విమానాశ్రయం నుంచి పంపించి వేశారు. ఈ ఘటనతో సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరాల్సిన దుబాయి-ముంబయి విమానం రాత్రి 7.37 గంటలకు టేకాఫ్ అయింది. ఫ్లైట్ గంటన్నర ఆలస్యం కావడంతో విమానంలోని మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Related posts