సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక సహా చి త్ర యూనిట్ బృందం హాజరు కాగా రాజ మౌళి, కొరటాల శివ లు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అల్లు అయాన్, అర్హలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకలో బుల్లి సెలబ్రెటీలు పైనే మీడియా వారు ఫోకస్ పెట్టారు. తండ్రి అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్హ, అల్లు అయాన్ లు పుష్ప ప్రీ రిలీజ్ స్టేజ్ పై చేసిన సందడి అందరిని ఆకట్టుకున్నారు.
స్టేజ్ మీద అల్లు అయాన్ ముందుగా నేను మాట్లాడతా అంటూ.. అడిగి మరీ మైక్ తీసుకునున్నాడు. తగ్గేదే లే అంటూ.. తన తండ్రి మేనరిజాన్ని చూపించి అందరితోనూ క్లాప్స్ కొట్టించాడు.
అలాగే అల్లు అర్హ అందరికీ నమస్కారం.. హాయ్ అంటూ చాలా క్లాస్ గా పలకరించింది. తరువాత తన తండ్రి అల్లు అర్జున్ స్టైల్ లో తగ్గేదే లే.. అంటూ డైలాగ్ చెప్పి.. విజిల్స్ వేయించింది. చిట్టి చిట్టి మాటలతో అయాన్, అర్హ లు చెప్పిన డైలాగ్స్ .. అక్కడ ఉన్న వారిందరికితో పాటు అభిమానులకు ఆకర్షించారు.