telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కుందేలు అని శ్రీముఖిని అనలేదు : నోయెల్

Noel

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. ఇంక ఒక్కవారం ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇప్పటికే రాహుల్ ఫైనల్‌కు వెళ్లిపోయాడు. ఇక వరుణ్ సందేశ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిల్లో నలుగురు ఫైనల్‌కు చేరుతారు. ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా… సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్‌గా ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఆయనకు గిఫ్ట్ ఇచ్చి వచ్చిన అనంతరం నోయెల్ ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో భాగంగా శ్రీముఖిపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. హౌస్‌లో రాహుల్‌కి ప్రేరణనిచ్చేందుకు నోయెల్.. ‘కుందేలులా పరిగెడితే విన్నర్ అవరు.. ఫైనల్‌గా విన్ అయ్యేది తాబేలే’ అని రాహుల్‌కి చెప్పాడు. కుందేలు అని శ్రీముఖిని ఉద్దేశించే నోయెల్ అన్నాడని ఆమె ఫ్యాన్స్ బయట ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై నోయెల్ మాట్లాడుతూ.. ‘రాహుల్‌ని బద్దకస్తుడు అంటారు. వాళ్ల అమ్మగారు కూడా హౌస్‌లో అదే చెప్పారు. నేను దాన్ని ఉద్దేశించే చెప్పాను తప్ప.. శ్రీముఖి గురించి చెప్పలేదు’ అని నోయెల్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Related posts