telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్రకాశం బ్యారేజికి … వరద పోటెత్తుతోంది… అప్రమత్తంగా ఉండాలని సూచనలు..

huge flood water to prakasham barrage

ప్రకాశం బ్యారేజికి భారీ వరద వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీచేశారు. ఎగువ నుండి భారీ ప్రవాహం వస్తుండటంతో బ్యారేజి వద్ద గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి ఎగువ నుండి 1. 50 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజిలోకి వస్తుండగా 70 గేట్లు ఎత్తి దిగువకు 1.25 లక్షల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుండి దిగువకు భారీ గా వరద వస్తుండటంతో బుధవారం అర్ధరాత్రి సమయానికి 3 నుండి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహం నాలుగు లక్షల క్యూసెక్కులకు చేరితే బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేయనున్నారు. ఎగువ, పరిసర ప్రాంతాల్లో జలాశయాలు నిండుకుండలా ఉండడంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఆనకట్టపై పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా, బుధవారం ఉదయం నుంచి వరద ఉధృతి అధికంగా ఉండటంతో మళ్ళీ పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తు దిగువ సాగర్‌కు 3,78,640 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడుకు 8125 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్టపై పది గేట్ల ద్వారా 3,78,640 క్యూసెక్కులు, రెండు విద్యుత్‌ కేంద్రాల నుంచి దిగువ సాగర్‌కు 4,47,455 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం జలాశయం నుంచి 4,59,206 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలకు వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం ఎగువ నుంచి 3,55,989 క్యూసెక్కుల నీరు వస్తుండగా రిజర్వాయర్‌కు ఉన్న గేట్లలో 14 గేట్లు ఎత్తి 3,69,693 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టిఎంసీలు కాగా ప్రస్తుతం 41.59 టిఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల నుంచి డెల్టా కాలువకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా ప్రస్తుతం డెల్టాలో నీటి వినియోగం తగ్గింది. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి కృష్ణా జలాలు వస్తుండటం తో పట్టిసీమ నుంచి గోదావరి జలాలను నిలిపివేశారు.

Related posts