సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం”మహర్షి” సినిమా గురువారం విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి మెయిన్ ప్లాట్‌తో అప్పటికే మరో దర్శకుడు కథను సిద్ధం చేసుకుని రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. ఆ దర్శకుడు శ్రీవాస్. ఈయన “మహర్షి” సినిమా కథ గురించి తెలియగానే ముందుగా షాకయ్యారట. అయితే శ్రీవాస్ కథ నాదంటూ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేయలేదు. “మహర్షి” చిత్రానికి ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజుని నేరుగా వెళ్లి కలిశారట. ఎందుకంటే దిల్‌రాజు బ్యానర్‌లో ఇది వరకు శ్రీవాస్ “రామ రామ కృష్ణ కృష్ణ” సినిమా చేశారు. ఆ పరిచయంతో సమస్యను దిల్‌రాజు దృష్టికి తీసుకెళ్లారట శ్రీవాస్. తమ “మహర్షి” సినిమా కథ.. శ్రీవాస్ రాసుకున్న కథ ఒకేలా ఉండటంతో దిల్‌రాజు కూడా షాకయ్యారట. అయితే సమస్యను ఇలాగే వదిలేస్తే పెద్దదయ్యే అవకాశం ఉందని గ్రహించిన దిల్‌రాజు, శ్రీవాస్‌కు సర్దిచెప్పారని తెలుస్తోంది. దిల్‌రాజు హామీతో శ్రీవాస్ వెనక్కి తగ్గారని ఫిలిం నగర్ టాక్.
previous post
next post
సల్మాన్ “పేపర్ టైగర్”… సింగర్ సంచలన వ్యాఖ్యలు