telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బన్నీ బుట్టబొమ్మ పేరిట మరో రికార్డ్…

buttabomma

గత ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఏ స్తాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం పాటలు. థమన్ అందించిన ఈ ఆల్బమ్ కు తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేమికులు ఫిదా అయ్యారు. ఇందులోని ప్రతి సాంగ్ ఓ అద్భుతం, ఓ రికార్డ్ అని చెప్పాలి. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్. దీనికి సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ నెల రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో రిలీజైనప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే ఉన్నది. తాజాగా ఈ పాట కొత్త రికార్డు సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు 500 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. లిరికల్ సాంగ్ 55 మిలియన్ వ్యూస్ కలుపుకుంటే మొత్తం 550 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాదు, రాములో రాములా లిరికల్ సాంగ్ 280 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటే, సామజవరగమన సాంగ్ 154 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఒక సినిమాలోని సాంగ్స్ ఈ స్తాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోవడం కూడా ఒక రికార్డ్ అని చెప్పాలి.

Related posts