క్వారంటైన్ కేంద్రంలో ఓ వలస కూలీ ప్రసవించింది. లాక్‌డౌన్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ 13 రోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఉంటోంది. నిండు గర్భిణి అయిన ఆమెను ప్రసవం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆసుపత్రి వెళ్లి ఆమెకు బేబీ కిట్‌ను అందజేశారు. అలాగే పుట్టిన బిడ్డ సంరక్షణకు రూ.25 వేలు అందజేశారు. ఆసుపత్రిలో అందించిన సేవలపై బాలింత సంతృప్తి వ్యక్తం చేశారు.