telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోహ్లీ, అనుష్క లకు బిడ్డ పుడితే… నా మనవడి గురించి మర్చిపోతారు : షర్మిలా ఠాగూర్

Taimur

తైమూర్ అలీ ఖాన్… బాలీవుడ్ పవర్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల ముద్దుల తనయుడు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రేక్షకులు అందరికీ తైమూర్ చాలా ఫేవరేట్. ఒక్కమాటలో చెప్పాలంటే సైఫ్, కరీనాల కంటే తైమూర్ ఫ్యాన్స్ జాబితానే ఎక్కువ. ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్, జాక్వెలీన్ ఫెర్నాండెజ్ సహా ఎందరో సెలబ్రిటీలు ఈ బుల్లి నవాబుకి ఫిదా అయిపోయారు. తైమూర్‌ పుట్టగానే పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు తైమూర్‌కు మూడేళ్లు. అంతేకాదు కేరళలోని ఓ మార్కెట్‌లో తైమూర్ అలీ ఖాన్ పేరుతో బొమ్మలు కూడా అమ్ముడుపోతున్నాయి. ఈ బుల్లి నవాబ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్‌కు ఇంతటి ఫాలోయింగ్ లేదు. అయితే తైమూర్ పాపులారిటీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలనాటి బాలీవుడ్ తార, సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిళా ఠాగూర్. తన కోడలైన కరీనా రేడయో షోలో షర్మిళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనవడి గురించి మాట్లాడుతూ… “ఇప్పుడు తైమూర్ చిన్న పిల్లాడు కాబట్టి వాడికి మీడియాలో ఎంత పాపులారిటీ ఉందో తెలీదు. కానీ పెద్దవాడయ్యే కొద్ది వాడికి అది సమస్య కావచ్చు. పెద్దయ్యాక వాడు కూడా సోషల్ మీడియా ఎకౌంట్స్ తెరుస్తాడు. తన ఫొటోలు, కామెంట్స్, వీడియోలు చూసి షాకవుతాడు. నా అభిప్రాయంలో మీడియా మనల్ని ఎంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుందో అంతకంటే త్వరగా కిందపడేలా చేస్తుంది. రేపు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు బిడ్డ పుడితే అప్పుడు అంతా నా మనవడి గురించి మర్చిపోతారు”అన్నారు. అంతేకాదు షర్మిళ తన కోడలిపై తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు. “నాకు నిలకడగా ఉండే నీ తీరు నచ్చుతుంది. ఎల్లప్పుడూ కుటుంబంతో నువ్వు టచ్‌లో ఉండే విధానం నచ్చుతుంది. నేను నీకు ఎప్పుడైనా మెసేజ్ చేస్తే ఎక్కడున్నా వెంటనే స్పందిస్తావ్. కానీ నా కూతురు వెంటనే రిప్లై ఇవ్వదు. తను ఎప్పుడో మెసేజ్ చూసుకుని రిప్లై ఇస్తుంది. కానీ నువ్వు అలా కాదు. నేను ఇంటికి వస్తున్నానని తెలిసి నాకు ఏం కావాలో అన్నీ అడిగి తెలుసుకుంటావ్. కపూర్ కుటుంబం నుంచి వచ్చిన నీకు ఆ మర్యాదలు తెలుసు. డైనింగ్ టేబుల్ నిండా నాకు నచ్చిన వంటకాలను సిద్ధం చేస్తావు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నీ బర్త్‌డే జరిగిన మరుసటిరోజే నా భర్త చనిపోయారు. నువ్వు మా ఇంటికి వచ్చి కుటుంబంలో ఒకదానిలా అన్ని పనులు చూసుకున్నావ్” అని తెలిపారు.

Related posts