telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇదే భారతీయుల గొప్ప సంఘీభావం : రాంగోపాల్ వర్మ

varma with 16 questions to court

ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా మనకు సేవ చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, మీడియా కోసం చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇవాళ మాత్రం లాక్ డౌన్ ఉన్నప్పటికీ అవన్నీ బేఖాతరు చేశారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా యధేచ్ఛగా రోడ్లపై తిరిగారు. దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ అయ్యారు. లాక్‌డౌన్‌ ప్రభుత్వం ఎందుకు పెట్టిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ప్రధాని. మనకోసం మనందరి కోసం లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వర్మ సైతం జనం తీరుపై మండిపడ్డారు. నిన్న ఎవరికోసం అయితే చప్పట్లు కొట్టారో… ఇవాళ వారినే ప్రజలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే భారతీయుల గొప్ప సంఘీభావం అంటూ ఎద్దేవా చేశారు. అయితే వర్మ ట్వీట్‌పై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. ‘మరి నీ డ్యూటీ ఇలా నాన్ సెన్స్ ట్వీట్స్ వేయడమా ? సడన్లీ రెస్పాన్స్ బుల్ సిటిజిన్ లెక్క మట్లాడకు’ అని ఓ నెటిజన్ వర్మ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. అయితే చాలామంది మాత్రం వర్మ ట్వీట్‌కు మద్దతు పలికారు.

Related posts