వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థిని సీఎం జగన్ పరిశీలించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంట మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కోడలి నాని, అధికారులు ఉన్నారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం..రూ.4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరాల కింద వెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని సీఎం జగన్ కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కూడా లేఖలో వివరించారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. అంతకు ముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన ఇసుక విధానం పై సమీక్ష సీఎం వైయస్ జగన్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారితో పాటు, పంచాయతీరాజ్ శాఖ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
previous post