telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్‌ విషయంలో మా మాట ఏ దేశం వినలేదు..ఎట్టకేలకు అంగీకరించిన ఇమ్రాన్‌

imran pakistan pm

కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్ కు అండగా ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తాయనుకున్నామని, కానీ తమ వెనుక నిలబడేందుకు ఒక్క దేశం కూడా ఆసక్తి చూపించలేదని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వాపోయారు. ఈ విషయంలో దౌత్యపరంగా ఓడిపోయామని అంగీకరించారు. . కశ్మీర్‌ విషయంలో ప్రగల్భాలు పలికిన ఆయన ప్రస్తుతం నిరాశతో మాట్లాడుతున్నారు. రష్యాకు చెందిన ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ ఇదంతా భారత్‌ గొప్పతనం ఏమీ కాదని వ్యాఖ్యానించారు.

కేవలం ఆ దేశంతో ప్రపంచదేశాలకు ఉన్న వాణిజ్య సంబంధాల వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.కశ్మీర్‌ను భారతదేశం తన భూభాగంలో కలిపేసుకుంటే ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తాయనుకున్నాం. కానీ అదేం జరగలేదు. మావైపు నిలబడడానికి ఒక్క దేశం కూడా ఆసక్తి చూపించలేదు.అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంలో తాము విఫలమయ్యామని అంగీకరించారు.పాక్‌కు అండగా నిలిచేందుకు ఒక్క దేశమూ ముందుకు రాలేదని అంగీకరించారు.

Related posts