telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : వితికా ఎలిమినేట్… భావోద్వేగానికి లోనైన వరుణ్

Vithika

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్రమం ముగింపు దశకు వచ్చేసింది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. గత వారం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉండగా… 12వ వారం కోసం అందరూ ఎలిమినేషన్ లోకి వచ్చారు. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా… తొలి రోజు నుండి కంబైన్డ్ గేమ్ ఆడుతున్న వ‌రుణ్ సందేశ్, వితికా షెరుపై తొలి రోజుల‌లో నెగెటివ్ ఒపినీయ‌న్ బాగా ఉన్నా, ఆమె నామినేష‌న్‌లోకి పెద్ద‌గా రాలేదు. అయితే ఈ వారం అంద‌రు నామినేష‌న్‌లోకి రావ‌డంతో వితికానే ఎలిమినేట్ అయ్యే కీల‌క‌మైన వ్య‌క్తి గా మారింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో బాబా భాస్క‌ర్, రాహుల్‌, శ్రీముఖి సేవ్ కాగా నామినేష‌న్‌లో వితికా, శివ‌జ్యోతి, వ‌రుణ్ సందేశ్‌, అలీ రెజా ఉన్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు సరికొత్త టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి.. ఛార్మి నటించిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాలోని పాటకు డాన్స్ చేసింది. మరోవైపు వితికా షేరు.. ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలోని అగ్గిపుల్ల లాంటి పాటకు డాన్స్ చేస్తే.. రాహుల్ .. ‘ముఠామేస్త్రీ’ లోని టైటిల్ సాంగ్‌కు చిందేసాడు. శివజ్యోతి కూడా చందమామ పాటకు డాన్స్ చేసింది. అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌ తమకిచ్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసాడు. ఇంకోవైపు కళ్లకు గంతలు కట్టుకొనే టాస్క్‌లో వితికా,వరుణ్ సందేశ్ బాల్స్‌తో ఆడుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అలీ రజా, రాహుల్ కళ్లకు గంతలతో ఒకరినొకరు గుద్దుకున్నారు. ఈ క్రమంలో అందరి కళ్లకు గంతలు కట్టుకొని ఈ స్కిట్స్ చేసారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముగ్గురిలో వితికా షేరు, వరుణ్ సందేశ్, అలీ రెజాల్లో ముందుగా అలీ రెజా సేఫ్ అయ్యాడు. ఇక భార్య భర్తలైన వరుణ్ సందేశ్, వితికా షేరుల్లో చివరికి వితికా షేరును ఎలిమినేట్ చేసాడు బిగ్‌బాస్. వితికా షేరు ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ భావోద్వేగానికి గురయ్యాడు.

Related posts