telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇదే…!

Commit-Mental

‘‘రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంది’’ అని ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి చెప్పడంతో పెళ్లి తేదీ ప్రకటిస్తుందేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ పున్ను అందరికీ షాక్ ఇచ్చింది. ఈ పెళ్లి గోల అంతా తన వెబ్ సిరీస్ ప్రసారం కోసం స్పష్టం చేసింది. పునర్నవి, యూట్యూబ్ స్టార్ పృథ్వీరాజ్ సంపర (ఉద్భవ్ రఘునందన్‌గా పేరు మార్చుకున్నారు) ప్రధాన పాత్రల్లో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించింది. హిందీ వెబ్ సిరీస్ ‘పర్మనెంట్ రూంమేట్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ‘కమిట్‌మెంటల్’ అని టైటిల్ పెట్టారు. ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం మేకర్స్ కాస్త భిన్నంగా ఆలోచించారు. పున్నుతో ఈ నాటకం ఆడించారు. కానీ ఈ వెబ్ సిరీస్ గురించి తెలిసినవాళ్లు పున్ను పెళ్లి నాటకం కచ్చితంగా ప్రచారంలో భాగమేనని కనిపెట్టేశారు. కాగా నవంబర్ 13 నుంచి ‘ఆహా’లో అందుబాటులోకి రానున్న ‘కమిట్‌మెంటల్’ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పున్ను.. ‘‘తప్పలేక ఒప్పుకున్నాను. ఇక ముందుంది అసలైన క్రేజీ రైడ్’’ అని పేర్కొన్నారు.

Related posts