telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ను హత్య చేసినట్టు ఆధారాలు లభించలేదన్న సిబిఐ

Sushanth

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత జూన్ నెల 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసులో కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులను సిబిఐ విచారిస్తోంది. ఇక ఎట్టకేలకు కేసు సిబిఐకు వెళ్లడంతో అసలు నిజానిజాలు తెలుస్తాయని సుశాంత్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి నుంచి సుశాంత్ ది హత్యే అని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సిబిఐ ఎవరూ ఊహించని ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు తాము చేసిన ఇన్వెస్టిగేషన్ లో సుశాంత్ ది హత్య అని చెప్పడానికి ఎలాంటి లింక్ దొరకలేదని తెలిపారు. అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆత్మహత్య గానే వచ్చిందని, అలాగే రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా ఇది హత్యే అనేందుకు సరైన ఆధారాలు దొరకలేదని సిబిఐ వారు తెలపడం సంచలనంగా మారింది.

Related posts