telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అలర్ట్ : ఈ మాస్క్ లు వాడితే.. కరోనాకు చెక్!

masks corona

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ ధాటిని ఎదుర్కోవాలంటే ఎన్‌-95 వంటి ప్రత్యేక రకం (హైఫై) మాస్కుల్ని వాడడం అన్నివిధాలా ఉత్తమమనీ, కనీసం వస్త్రంతో తయారైనవాటిని వాడినా ఎంతోకొంత రక్షణ కచ్చితంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. వైరస్‌ ఎంతమందికి సోకిందో సత్వరం తేల్చడంలో ర్యాపిడ్‌ పరీక్షల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 

హైఫై మాస్క్‌ల ఉపయోగాలేమిటి? 

కరోనాపై పోరాటంలో అవి ఏ మేర ఉపకరిస్తాయి..?

కెఎఫ్‌ 94, ఎన్‌ 95, ఐరోపాలోని ఎఫ్‌ఎఫ్‌పి-2, చైనాలోని కెఎన్‌-95 మాస్క్‌లను హైఫై మాస్క్‌లుగానే పరిగణిస్తాం. సాధారణంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు గాలిలో ఉన్నవన్నీ లోపలికి వెళతాయి. గాలి ద్వారా ప్రయాణించే కరోనా బహిరంగ ప్రదేశాల్లో కన్నా మూసి ఉన్న గదుల్లో ఎక్కువగా పోగు పడుతుంది. అక్కడ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన రోగి ఉంటే.. గదిలో పొగ తాగితే ఎలా దట్టంగా అలముకుంటుందో అతడి శ్వాస పరిస్థితీ అలానే అవుతుంది. హైఫై మాస్కుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 

హైఫై అంటే…హై ఫిల్టరేషన్, హై ఫిట్‌. 

ఏ మాస్క్‌ వినియోగంతో ఎక్కువ రక్షణ అన్న సందేహాలు వీడటం లేదు. ప్రస్తుతానికి చాలా మంది ఎన్‌ 95 మాస్క్‌లనే ప్రామాణికంగా భావిస్తున్నారు.

ఎన్‌ 95 మాస్క్‌లు అమెరికా సీడీసీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సంయుక్త ప్రమాణాల మేరకు తయారవుతాయి. వస్త్రంతో తయారైన మాస్క్‌ పెట్టుకుంటే.. శ్వాస తీసుకున్నప్పుడు సూక్ష్మ రేణువులు లోపలికి వెళ్లిపోతాయి. ఆ మాస్క్‌లు ఈ రేణువులను 20 శాతమే నిలువరించలగలవు. 95% మేర వీటి నుంచి రక్షణ పొందేలా ఎన్‌ 95 మాస్క్‌ను తయారు చేశారు. వాటినైనా వదులుగా ధరిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. 

రెండు మాస్కులు ధరించటం సురక్షితమేనా..? 

చాలామంది దీనివల్ల శ్వాస తీసుకోలేకపోతున్నామని అంటున్నారు? 

వైరస్‌ను అడ్డుకోవడంలో రెండు మాస్కులు ఒక ప్రత్యామ్నాయం. ఎన్‌ 95 లాంటి మాస్క్‌లు అందుబాటులో లేనప్పుడే ఇవి ధరించాలి. డబుల్‌ మాస్క్‌లు వేసుకుంటే 75% మాత్రమే వైరస్‌ నుంచి రక్షణ ఉంటుందని గుర్తించాం. అదే ఎన్‌ 95 మాస్క్‌తో 5% మాత్రమే గాలిలోని సూక్ష్మకణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్తాయి. ఇవి అందుబాటులో లేనప్పుడు సర్జికల్‌ మాస్క్‌ ధరించాలి. దానిమీద క్లాత్‌ మాస్క్‌ పెట్టుకోవాలి.

Related posts