telugu navyamedia
వార్తలు సామాజిక

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం

3 died in mumbai for huge rains

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ముంబైని, కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. చెంబూర్, సెంట్రల్ ముంబై నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొలాబా అబ్జర్వేటరీ, శాంతాక్రజ్ ప్రాంతాల్లో గడచిన 24 గంటల వ్యవధిలో కుండపోత వానలు కురిశాయి. రాగల 24 గంటల్లో ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Related posts