telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాత్రంతా హాయిగా నిద్రపోయిన మహిళ… ఉదయాన్నే ఆ దృశ్యం చూసి…!

Brisbane

రాత్రంతా హాయిగా నిద్రపోయిన మహిళకు పొద్దులేచి పక్కన చూస్తే గుండె ఆగినంత పనైంది. నిద్ర నుంచి లేచిన ఆమె కళ్లు తెరిచి చూసేసరికి కూతవేటు దూరంలో కొండచిలువ కనిపించింది. బ్రిస్బెన్‌లో ఉండే సెల్లీ స్టెంట్‌ అనే మహిళకు ఈ భయానక అనుభవం ఎదురైంది. ఆమె నిద్రలో ఉన్నప్పుడు తన నుదిటిపై ఏదో చల్లని వస్తువు తాకినట్టు అనిపించిడంతో మొదట దాన్ని చేతితో పక్కకు తోసేసింది. కానీ, మళ్లీ అలాగే అనిపించడంతో కళ్లు తెరిచి చూసిన ఆమెకు నోటమాట రాలేదు. స్టెంట్‌కు కొంచెం దూరంలోనే రెండు అడుగుల కొండచిలువ ఉంది. పైగా ఆమె వైపే తిరిగి ఉండడంతో పాటు బుసలు కొడుతోంది. దీంతో సెల్లీ భయపడకుండా మెల్లిగా పడక గది నుంచి బయటకు వచ్చి పామును అందులోనే బంధించింది. అనంతరం తన తండ్రితో గదిలో కొండచిలువ ఉన్న ఈ విషయాన్ని చెప్పింది. దాంతో అతడు గది తలుపు తెరిచి చూశాడు. కానీ, కొండచిలువ కనిపించకపోవడంతో కూతురు జోక్ చేస్తుందనుకున్నాడట. కూతురు నిజంగా గదిలో పాము ఉందని పట్టుబట్టడంతో చేసేదేమిలేక పాము పట్టేవాళ్లను పిలిపించాడు. వాళ్లు వచ్చి చాలాసేపు వెతికిన తరువాత ఆ గదిలోని ఓ టేబుల్ కింద కొండచిలువ నక్కి ఉండడం గుర్తించారు. అనంతరం దాన్ని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Related posts