telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అనంతపురంలో లోకేష్ పర్యటన….

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి… ఇప్పటికీ పలు కాలనీలు ఇంకా వర్షంనీటిలోనే ఉండగా.. మళ్లీ మళ్లీ వర్షం కురుస్తూనే ఉండడం ఇబ్బందిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతినగా… అపారనష్టం జరిగింది. ఈ విషయం పై నారా లోకేష్ ట్విట్టర్ లో ”ఈరోజో రేపో చేతికి అందుతుందనుకున్న పంట అకాల వర్షాలతో అందకుండా పోయిన దుఃఖంలో ఉన్న రైతుకు భరోసా అందించేందుకు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నాను. గుంతకల్లు నియోజకవర్గం కరిడికొండ గ్రామంలో పొలాల్లోనే కుళ్లిపోయిన వేరుశనగ పంటని చూస్తే బాధేస్తోంది.” అన్నారు. అయితే భారీ వర్షాలతో దెబ్బ తిన్న పంటలకు రూ. 10.76 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు.. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు గానూ ఈ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో నష్టపోయిన రైతులకు ఈ ఇన్ పుట్ సబ్సిడీని అందజేయనున్నారు అధికారులు.

Related posts