టెలీకాం రంగంలో వివిధ కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తాజాగా భాతీయ టెలీకాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్, గ్రేస్ పీరియడ్‌లో ఉన్నవారి కోసం, రద్దయిన వినియోగదారుల కోసం అదనపు టాక్‌టైం ఆఫర్లు ద్వారా రెండు ప్రత్యేక ఓచర్లను ప్రవేశపెట్టినట్టు ఏలూరు జనరల్ మేనేజర్ కేఎస్.వరప్రసాద్ తెలిపారు. రూ.150 టాప్‌అప్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో రూ.180 టాక్‌టైంను ఇస్తున్నామన్నారు.
రూ.151 ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్కులకు అపరిమిత ఫ్రీకాలింగ్ ఇస్తున్నామన్నారు. రోజుకు 3.2 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తున్నామన్నారు. రూ.298 ఓచర్ ద్వారా, ప్లాన్ రూ.328కు మారిన వారికి 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ ఇస్తున్నామన్నారు. 300 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా ఇస్తామన్నారు. 180 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని కూడా పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.