telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

‌ చైనాకు యాపిల్‌ షాక్.. గేమ్స్‌ యాప్‌ల తొలగింపు!

cell phone

గాల్వన్‌ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఇటీవలే 59 చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బ నుంచి చైనా తేరుకోకముందే యాపిల్‌ సంస్థ మరో షాకిచ్చింది. చైనీస్‌ యాప్‌ స్టోర్‌లోని 4,500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగిస్తూ యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం మూడు రోజుల వ్యవధిలో యాపిల్‌ ఇంత భారీగా యాప్‌లను తొలగించింది. మొబైల్ గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో యాపిల్ పలు సంస్కరణలకు చేపట్టింది. ఇందులో భాగంగానే యాపిల్‌ చైనా గేమ్స్‌ను‌ తొలగించింది. చట్టపరమైన అనుమతి లేని గేమ్స్‌ ను తాము ఉండనివ్వబోమని తేల్చి చెప్పింది.

లైసెన్స్‌ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తాము గత ఏడాదే ప్రకటన చేసినట్లు యాపిల్ చెప్పింది. కావాలంటే తొలగించిన ఆ యాప్‌లను లైసెన్స్‌ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన తర్వాత అప్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. యాపిల్‌ తీసుకున్న ఈ కఠిన చర్యలతో చైనా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts