telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఫోన్ బిల్ ఎక్కువైందని గన్ తో కాల్చి చంపేశాడు

Gun

సెల్‌ఫోన్ బిల్ కట్టడానికి టర్కీలోని సకర్యాలో ఓ స్టోర్‌కు వచ్చాడో వ్యక్తి. అక్కడున్న ఓ ఉద్యోగినితో తన బిల్లు చాలా ఎక్కువగా వచ్చిందంటూ వాగ్వాదానికి దిగాడు. దానికి తామేమీ చేయలేమని, అతను వాడుకున్న దాన్ని బట్టే బిల్లు వస్తుందని ఆమె అతనికి నచ్చజెప్పబోయింది. అంతే కోపంతో చిందులు వేసిన అతను.. వెంటనే తన జేబులోంచి తుపాకీ తీసి ఆమెకు గురిపెట్టాడు. భయంతో ఆమె బల్ల కింద దూరడంతో వెన్నులో కాల్చిపారేశాడు. ఆ ఘోరం చూసి కేకలేసిన మరో ఉద్యోగినిని తలలో గుండు దింపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హడావిడిగా పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేశారు.

Related posts