బీహార్ ఎన్నికల నుంచే లాలూ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే.. అయితే.. తాజా ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్ ప్రసాద్ ఇవాళ తెలిపారు. లాలూ మూత్ర పిండాలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నందున ఏ సమయంలోనైనా పరిస్థితి క్షీణించే అవకాశాలున్నాయని చెప్పారు. లాలూ పరిస్థితిని ఆయన చికిత్స పొందుతున్న రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా తెలిపారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానని.. లాలూ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందనేది నిజమన్నారు. పనితీరు భవిష్యత్తులో మరింత దిగజారిపోవచ్చని… అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పడం కష్టమని పేర్కొన్నారు డాక్టర్ ప్రసాద్. గత 20 ఏళ్లుగా ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నందున కిడ్నీ దెబ్బతింటూ వచ్చిందని.. పెషెంట్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని రిమ్స్‌కు లిఖితపూర్వకంగా తెలిపానని ఆయన వెల్లడించారు. ఇది ఇలా ఉండగా.. దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో బెయిల్ లభించినప్పటికీ మరో కేసులో లాలూకు ఊరట లభించలేదు.
previous post
next post
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు