telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రస్తుతం దేశంలో 17,610 యాక్టివ్‌ కేసులు

Janatha carfew AP cader IAS Officer

ఈ రోజు  మధ్యాహ్నం వరకు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,077కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,684 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,077కు పెరిగిందని వెల్లడించింది. భారత్‌లో కరోనా బాధితుల రికవరీ 20.57శాతంగా ఉందని పేర్కొంది. గడచిన 28 రోజుల్లో 15 జిల్లాల్లో జీరో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

గత 14 రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం దేశంలో 17,610 యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల్లో 491 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,078వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవారం వరకు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు పూర్తి చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వివరించారు.

Related posts