telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌కు….అంతర్జాతీయ స్థాయి పురస్కారం …

singareni cmd got international award

సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అంతర్జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ఆసియా వన్‌ ప్రతిఏటా ప్రకటించే ‘ది లీడర్‌’ అవార్డుకు శ్రీధర్‌ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 7న బ్యాంకాక్‌లో జరగనున్న కార్యక్రమంలో శ్రీధర్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఆసియాలో వాణిజ్య, పరిశ్రమల విభాగంలో ఎంపిక చేసినటువంటి అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రెండు దశల్లో పరిశీలించిన తర్వాత ఈ అవార్డుకు శ్రీధర్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సింగరేణి సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తూ అద్భుతమైన వృద్ధి రేటును సాధిస్తున్నందుకు గుర్తింపుగా శ్రీధర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారని మ్యాగజిన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అవార్డు సింగరేణి కార్మికుల కృషికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నానని సీఎండీ శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు, అధికారుల సమష్టి కృషి, సహకారం వల్లే సంస్థ అత్యున్నత స్థాయికి ఎదుగుతుందన్నారు.

Related posts