రెండు నెలల ముందు 22 క్యారెట్ల బంగారం ధర 31 వెయ్యి వద్ద ఉండే.. ఇప్పుడు 36 వేలు. ఇంకా 24 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములు బంగారం 40వేలు పడుతుంది. ఇంకా ఇదే రేటుతో బంగారం కొనాలని నగల దుకాణాల వద్దకు వెళ్తే 10గ్రాముల బంగారం అన్ని ఛార్జీలతో కలిపి 50వేలు చేస్తుంది. దీంతో బంగారం కొనాలంటే పసిడి ప్రియులు వెనకడుగు వేస్తున్నారు. ఈ పండుగా సీజన్ లో బంగారం ధర భారీగా పెరిగినా, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నగల దుకాణాలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. దేశంలోనే ప్రముఖ నగల సంస్ధలు ఈ ఆఫర్లను ప్రకటించాయి. కళ్యాణ్ జ్యూయలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, తనిష్క్ వంటి నగల సంస్దలు భారీ ఆఫర్స్ ని ప్రకటించాయి. ఆ ఆఫర్స్ ఏంటో చుడండి ..
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణంలో రూ.15 వేలకుపైగా నగలు కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ దుకాణంలో అడ్వాన్స్ గా బంగారాన్ని బుక్ చేసుకుంటే.. డెలివరీ సమయంలో ధర తక్కువ ఉన్న, ఆర్డర్ ఇచ్చిన సమయంలో తక్కువ ఉన్న ఆ తక్కువ ధరనే కస్టమర్లు చెల్లించే అవకాశాన్ని ఆ సంస్ద ఇచ్చిందట.
దీపావళి సందర్బంగా కళ్యాణ్ జ్యూయలర్స్ కూడా నగల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. వీటితో పాటు ప్రతి వారం లక్కీ డ్రా నిర్వహించడంతో తన కస్టమర్లకు మూడు లక్షల గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇవ్వనుంది. కాగా నగల తయారీ ఛార్జీలను తగ్గించనుంది. దీంతో పాటు అదనపు డిస్కౌంట్ల కోసం కళ్యాణ్ జ్యూయలర్స్ పలు బ్యాంకులతో భాగస్వామ్యం అయ్యింది.
తనిష్క్ జ్యూయలరీ సంస్థ తన కస్టమర్లకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలను 25 శాతం తగ్గించాలని ఆలోచించిందట. ఈ ఆఫర్ తో పాటు సోషల్ మీడియాలో పోటీలను నిర్వహించడం ద్వారా గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వాలని తనిష్క్ ప్లాన్ చేస్తోంది.