telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వేములవాడలో కేసీఆర్, మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం…

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేంటి.. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చిత్ర పాటాలను ఒకే దగ్గర పెట్టి పాలాభిషేకం ? ఇదేలా సాధ్యం.. అని అనుకుంటున్నారా.. కానీ, నిజమే.. . దీని కారణం.. అగ్ర వర్ణాల నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడమే.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకోగా.. వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారు లబ్ధిపొందనున్నారు. ఇక, ఆర్థికంగా వెనకబడిన తరగతులను ఆదుకునేందుకు కేంద్రం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలు జరుగుతుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన వైశ్య, రెడ్డి, వెలమ సంఘం నాయకులు.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ చిత్రపాటాలను పక్కపక్కనే పెట్టి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related posts